ఫిరంగి నాలా పైనే మెయిన్ గేట్.. రిపోర్ట్ ప్రకారం చర్యలు..!

-

జన్వాడలో ఫిరంగి నాలా సర్వే ముగిసింది. మొత్తం 4 గంటల పాటు ఈ సర్వే నిర్వహించారు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే కొనసాగింది. కేటీఆర్ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌజ్ ముందు నాలా సర్వే చేసి పరిశీలించారు అధికారులు. నాలా పైనే ఫామ్ హౌజ్ మెయిన్ గేట్ కట్టినట్లు గుర్తించారు అధికారులు. మొత్తం 18 నుంచి 20 మీటర్ల వెడల్పు ఉండాల్సిన నాలా 4 నుంచి 5 మీటర్లు మాత్రమే ఉందని అధికారులు సర్వేలో గుర్తించారు. నాలా బఫర్ జోన్ అంతా అక్రమించినట్లు గుర్తించారు అధికారులు.

అయితే ఫిరంగి నాలా మొత్తం పొడవు 21 కిలో మీటర్లు. నక్ష, డీజీపీఎస్ తో డిజిటల్ సర్వే చేసారు అధికారులు. సర్వే ముగిసిన అనంతరం రిపోర్ట్ ను ఉన్నతాధికారులకు సబ్మిట్ చేయనున్నారు అధికారులు. అయితే ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకోనున్నారు ఉన్నతాధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news