నామినేటెడ్ పోస్టులపై కసరత్తు చేస్తున్నాం. మిత్రపక్షాలతో కూడా మాట్లాడాలి. నామినేటెడ్ పోస్టుల భర్తీ సైంటిఫిక్కుగా ఉంటుంది అని సీఎం చంద్రబాబు అన్నారు. అభ్యర్థుల సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో.. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకుంటాం. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది అని భరోరా ఇచ్చారు సీఎం. అలాగే ప్రతి ఒక్కరూ పదవిని ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడ్డారు.. దీంతో అధికారంలోకి రాగానే వెంటనే తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఇందులో తప్పు లేదు.. కానీ వైసీపీ చేసిన తప్పే నేను చేయకూడదు.
అలాగే ఇసుకను ఫ్రీగా ఇవ్వడం నాకు ఇప్పుడు అతి పెద్ద ఛాలెంజ్. వరద ఉంది.. ఇసుక రీచుల్లో నుంచి ఇసుకను తవ్వలేం. సెక్రటేరీయేట్టుకు వస్తుంటే పెద్ద ఎత్తున ఇసుక లారీల క్యూ చూశాను. ఇప్పుడు వెయింటింగ్ లేకుండా స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాం అని చంద్రబాబు పేర్కొన్నారు.