KCR అంతా బాగానే చేశాడు..కానీ అందుకే అధికారం కోల్పోయాడు – జీవన్‌ రెడ్డి

-

KCR అంతా బాగానే చేశాడు..కానీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం KCR స్వయంకృపరాధమేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం లో ని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ… ఫోన్ ట్యాపింగ్ కి ప్రధాన బాద్యుడు కెసిఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో కెసిఆర్ ఇరుక్కాపోతాడు… కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు ను CBI విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

ప్రధానమంత్రి మోడీ దేశం లో మత్తవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు… ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే EWS రిజర్వేషన్లలో మార్పులు చేస్తామని… అన్ని వర్గాల్లో ఆర్థిక వెనుకబడిన వారికి EWS రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలలో హిందూ సమాజానికి మోడీ చేసిందేమి లేదు… SC, ST, BC ల కు అన్యాయం చేస్తుంది నరేంద్ర మోడీ అంటూ ఆగ్రహించారు. EWS లో ముస్లిం లు రిజర్వేషన్లు పొందుతున్నారు…కులం,మతం అనే బేధం లేకుండా EWS ను అన్ని వర్గాల్లో ఆర్థికంగా వెనుకపడ్డ వారికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version