షర్మిలమ్మా!..తెలంగాణ బిడ్డ పీవీ అవమానించింది.. మీ నాయనా అని మరిచావా – జీవన్ రెడ్డి

-

వైఎస్‌ షర్మిలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. షర్మిలమ్మా! తెలంగాణ బిడ్డ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను దించడానికి హైదరాబాద్‌ పాతబస్తీలో మత కల్లోలాలు సృష్టించి అమాయకులైన ఇరు మతాల వారిని పొట్టన పెట్టుకున్నరు మీ రాజన్న! అంటూ చురకలు అంటించారు.

లండన్‌ బ్యాంకుల్లో బంగారం కుదువబెట్టుకొని బతికే స్థితి నుంచి భరతమాతను ఒడ్డుకు చేర్చిన తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు, ఈ గడ్డ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకు మీ నాయన చేసిన అవమానం మరవగలమా? అని ఫైర్‌ అయ్యారు.

ఢిల్లీలో నంద్యాల గల్లీలో మీరంతా తెలంగాణపై విషం చిమ్మిన విషయం చరిత్రలో లిఖించబడింది కదా? యెట్లా చెరిపేయగలరు.. మా నాయకుడు చెప్పిన ‘ప్రజలు గెలువాలి’ అనే యజ్ఞంలో మేము ఉన్నం.మా కాళ్ళకూ అడ్డుపడితే తొక్కేస్తూ పోతం. మూటాముల్లే సర్దుకోండి. బాధ్యత ఏమన్నా ఉంటే రాయలసీమను కాపాడుకోండి. కొంచెమైనా పాపపరిహారం అయితది. సెలవ్‌!! అంటూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version