Sobhita Dhulipala : బ్లాక్​ ఔట్​ఫిట్​లో శోభితా ధూళిపాళ గ్లామర్ షో

-

పదహారణాల తెలుగు అందం.. అయినా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్.. ఇలా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలన్నింటిలో తన సత్తా చాటుతోంది. ఆమే తెలుగు చిన్నది.. శోభిత ధూలిపాళ. ఈ బ్యూటీ గూఢచారి సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైంది. అచ్చమైన ఈ తెలుగందం ఆ తర్వాత అడవి శేష్ నటించి మేజర్​లో కనిపించింది. ఇక వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన హవా కొనసాగిస్తోంది.

అటు బాలీవుడ్​లోనూ ఈ బ్యూటీ తన సత్తా చాటుతోంది. ఆ తర్వాత హాలీవుడ్​కూ వెళ్లింది. ‘స్లమ్​డాగ్​ మిలియనీర్​’ హీరో దేవ్​ పటేల్​ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంకీమ్యాన్​’ అనే యాక్షన్​ థ్రిల్లర్​లో నటించింది. ఇలా అన్ని ఇండస్ట్రీల్లో పనిచేస్తూ బిజీబిజీగా ఉన్నా ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్​గా ఉంటుంది.

తరచూ తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్​ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ విషయాలు కూడా పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ అవుతోన్న ది నైట్ మేనేజర్ సిరీస్​లో నటించింది.

ది నైట్ మేనేజర్ సిరీస్ ప్రమోషన్స్​లో శోభిత సందడి చేసింది. బ్లాక్​ షైనింగ్​ డ్రెస్​లో ఈ ప్రమోషన్స్​లో పాల్గొంది. ఈ ఔట్​ఫిట్​లో శోభిత చాలా హాట్​గా కనిపిస్తోంది. ఈ ఫొటోలు కాస్త తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు శోభిత అందాలు అదుర్స్​ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version