ఉద్యోగుల సమస్యలను రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు : జోగు రామన్న

-

తెలంగాణ భవన్ మాజీ మంత్రి జోగు రామన్న ప్రెస్ మీట్ లో కీలక కామెంట్స్ చేసారు. మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే టీ రామారావు గారిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలం కలిసాం. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్న ఉదంతాలను కేటీఆర్ గారి దృష్టికి తెచ్చాము. అసెంబ్లీ సమావేశాల్లో ఆదిలాబాద్ కు సంబంధించిన పెండింగ్ అంశాలు లేవనెత్తాలని కోరాం. సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తున్నారు.

ఎన్నికల సమయం లో రేవంత్ రెడ్డి వారి సమస్యలను చాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏడాది పాలన పూర్తయినా సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను రేవంత్ రెడ్డి పట్టించుకున్నా పాపాన పోలేదు. ఆశా వర్కర్లు తమ డిమాండ్ల పై రోడ్డెక్కితే పోలీసులతో కొట్టించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో సీనియర్ నాయకులు పార్టీ ని విడిచివెళ్లినప్పటికీ బీఆర్ఎస్ బలం చెక్కు చెదరలేదు అని జోగు రామన్న అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version