రివైండ్ 2024 : వెయ్యికోట్ల క్లబ్బులో తెలుగు నుండి రెండు సినిమాలు..

-

వెయ్యి కోట్లు.. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన సినిమాలు 100 కోట్ల మార్కును టచ్ చేయడమే ఘనతగా ఉండేది. సూపర్ డూపర్ బ్లాక్బస్టర్ అయిన సినిమాలు 100 కోట్ల మార్కును తాకేవి.

ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. మన సినిమాలు 1000కోట్లను అందుకుంటున్నాయి. ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమ నుండి నాలుగు సినిమాలు 1000 కోట్ల మార్కును అందుకున్నాయి. అందులో ఈ సంవత్సరం రెండు సినిమాలు ఉన్నాయి.

కల్కి 2898 AD:

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి చిత్రం ఈ సంవత్సరం జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా వైజయంతి నెట్వర్క్ బ్యానర్ పై సి అశ్వినీ దత్ నిర్మించారు. ఈ సినిమాకు రెండవ భాగం కూడా ఉంది. అన్నీ కుదిరితే 2027 లో కల్కి సెకండ్ పార్ట్ వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమా చిత్రీకరణ 2025లో మొదలుకానుందని సమాచారం. దీపికా పదుకొనే హీరోయిన్గా కనిపించిన ఈ చిత్రంలో అమితాబచ్చన్ అశ్వత్థామ పాత్రలో అలరించారు.

పుష్ప 2 :

ఈ సంవత్సరం రిలీజ్ కి ముందు అత్యంత హైప్ తెచ్చి పెట్టుకున్న చిత్రం పుష్ప 2. పుష్ప మొదటి భాగం రిలీజ్ అయిన మూడేళ్ల తర్వాత వచ్చిన ఈ చిత్రానికి రిలీజ్ కి ముందు విపరీతమైన హైప్ నెలకొంది. హైప్ కి ఏమాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది పుష్ప 2. ఆల్రెడీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిపోయింది పుష్ప 2 చిత్రం. అల్లు అర్జున్ కి ఇది మొదటి 1000 కోట్ల సినిమా.

పుష్ప 2 సినిమా సాధించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్లు సాధించిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా పుష్ప 2 రికార్డు కెక్కింది. అంతేకాదు హిందీ బెల్టులో ఒకే ఒక్క రోజులో 86 కోట్ల కలెక్షన్లు సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది.

అన్నీ కలిసి వస్తే పుష్ప 2.. 2వేల కోట్ల కలెక్షన్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ పండితులు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version