జీతాలు రావడం లేదంటూ GHMC హెడ్ ఆఫీస్ లో కార్మికులు..!

-

గత ఐదు నెలలుగా తమకు జీతాలు రావడం లేదంటూ GHMC హెడ్ ఆఫీస్ కి వచ్చారు కార్మికులు. అడ్మిన్ అడిషనల్ కమీషనర్ ని కలిస్తే.. ఎందుకు వచ్చారు వెళ్ళిపొండి అంటూ మా పైన సీరియస్ అవుతుందంటున్నారు కార్మికులు. ఓల్డ్ సిటీలో ఉన్న పార్కుల్లో పని చేస్తున్న ఈ కార్మికులు తమ బాధను బయట పెట్టారు.

ఐదు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఇళ్లు గడవక ఇబ్బందులు పడుతున్నాం. 30 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాం. కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ లో పని చేసే మా అందరికీ కోర్టు ఆర్డర్ తో బేసిక్ పే తో పాటు DA, HRA లతో సాలరీ వచ్చేది. సుమారు 50 మంది కార్మికులకు ఐదు నెలల నుంచి జీతాలు రావడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ మాకు మాత్రం ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. మీకు బేసిక్ సాలరీ మాత్రమే ఇస్తాం.. DA, HRA ఇవ్వమని అధికారులు అంటున్నారు. మా జీతాలు బడ్జెట్ రిలీజ్ అయ్యి చాలా రోజులైనా.. ఉన్నతాధికారులను కలిస్తే బడ్జెట్ రిలీజ్ కాలేదంటున్నారు అని కార్మికులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version