నేడు మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. అయితే.. ఉదయం నుంచే పోలింగ్ బూత్‌ల ముందు భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులోని ఓ పోలింగ్ బూత్ లో ఈవీఎం పనిచేయలేదు.. ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఓటర్లు పోలింగ్ కేంద్రంలోనే కూర్చున్నారు.
ఇది ఇలా ఉంచితే.. మునుగోడులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కేఏ పాల్ చేతి వెళ్ళన్నింటికీ ఉంగరాలు ధరించి రాగా, ‘ మీది ఉంగరం గుర్తు. చేతికి ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్ లోకి రావడం రూల్స్ బ్రేక్ చేసినట్టు కాదా?’ అని రిపోర్టర్లు ప్రశ్నించారు. ‘టిఆర్ఎస్ వాళ్ళు బయట కార్లలో తిరుగుతున్నారు. వాళ్ళు కార్లలో రాకుండా సైకిల్ మీద వస్తారా?’ అని పాల్ సమాధానమిచ్చారు. అనంతరం ఇంకో బూత్ చూడాలని చెబుతూ, పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు.
పోలింగ్ బూత్‌లో ఉంగరాలతో కేఏపాల్ హల్చల్ – TV9#MunugodeByPoll Live: https://t.co/DkuNtXRs1v#MunugodeBypoll #MunugoduByElection #KAPaul pic.twitter.com/J89wfNSlCU
— TV9 Telugu (@TV9Telugu) November 3, 2022
మాములుగా ఉండదు మా పాల్ హంకుల్ తో
లాజిక్ లతో చంపేస్తాడు….#tv9 shock#KAPaul rock🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/Lduux8tZB6
— Syed Mahaboob Basha (@Smahaboob17) November 3, 2022