సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కే.ఏ.పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే ఏడుపు వస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్  అన్నారు. ఉద్యోగుల సమ్మెను ఉద్దేశించి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పాల్.. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు, బిక్షగాళ్లలా చూస్తున్నారు, ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, విదేశాల నుంచి డబ్బు తీసుకురాలేము, శాలరీలు ఇవ్వలేము.. మమ్మల్ని ముక్కలు చేసుకొని తిన్నా డబ్బు లేదు అని రేవంత్ మాట్లాడుతున్నారని చెప్పారు.

తెలంగాణలో పాత అప్పు 7 లక్షల కోట్లు, కొత్త అప్పు 2 లక్షల కోట్లు మొత్తం కలిపి దాదాపు 10 లక్షల కోట్లు అయ్యిందని, ఈ అప్పుకు వడ్డీ ఎవరు కడతారు అని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. ఈ ముఖ్యమంత్రులు మారి నాతో గత వారం అమెరికా వాషింగ్టన్ డీసీ, రెండు వారాల క్రితం యూరప్, టర్కీలో జరిగిన సమ్మిట్ లకు హాజరై ఉంటే వందలు, వేల కోట్లు తెచ్చుకుంటే కనీసం నిరుద్యోగులు ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు ఆగేవని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధి కోసం నాతో కలుస్తామని అంటారు.. కలవరని, తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల సీఎంలు తనను కలిసేటట్టు ప్రార్ధించాలని కోరారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో వారిని చిత్తు చిత్తుగా ఓడించి, రాష్ట్రాల్ని, దేశాన్ని కాపాడుకుందామని కేఏ పాల్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news