చీనాబ్ పై భారత్ యాక్షన్.. పాకిస్తాన్‌కు వరద షాక్

-

పాకిస్తాన్‌కు భారత్ మరోసారి తీవ్ర ముట్టడి చేసింది. చీనాబ్ నదిపై నియంత్రణ ప్రదర్శిస్తూ 24 గంటల పాటు నీటిని నిలిపివేసిన భారత్, తాజాగా ఒక్కసారిగా భారీగా నీటిని విడుదల చేసింది. భారత చర్యలతో పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం అంతటా వరద భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం “వరద హెచ్చరికలు” జారీ చేసింది. పాక్ మీడియా కథనం ప్రకారం, భారత్ ఏకంగా 28,000 క్యూసెక్కుల నీటిని చీనాబ్ నదిలోకి వదిలింది. హెడ్ మారాలా వద్ద నీటి మట్టాలు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఈ ఆకస్మిక ప్రవాహం వల్ల సియాల్‌కోట్, గుజ్రాత్, హెడ్ ఖాదిరాబాద్ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.

భారత్ చీనాబ్ నదిపై నిర్మించిన బాగ్లీహార్ మరియు సలాల్ ప్రాజెక్టుల గేట్లను ఒక్కసారిగా ఎత్తేయడంతో పాక్ వర్గాల్లో కలకలం మొదలైంది. నది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలు, వ్యవసాయ భూములకు ప్రమాదం పొంచి ఉంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని వనరులలో చీనాబ్ ప్రధానమైనదిగా భావించబడుతోంది. ఈ పరిణామాలకు నాంది వేసింది ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి. ఆ దాడి తర్వాత భారత్ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రకటించింది. అప్పటి నుంచి చీనాబ్ నది నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటూ, తాజాగా ఒక్కసారిగా వదిలేసి పాక్‌ను వరదల ముప్పుతో గుబురుపరిచింది.

 

Read more RELATED
Recommended to you

Latest news