రేవంత్‌ రెడ్డి.. తన పార్టీ వారితో జాగ్రత్తగా ఉండాలి : కడియం శ్రీహరి

-

శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఏడోరోజైన నేటి చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పార్టీ వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాను, రేవంత్‌ రెడ్డి ఒకే స్కూల్‌లో చదువుకున్నామని.. తనకు రేవంత్‌ జూనియర్ స్టూడెంట్‌ అని తెలిపారు. రేవంత్ సీఎంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. ఆయనకు తమ పార్టీ నుంచి ఏ రకమైన ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. అయితే సొంత పార్టీ నుంచే ఆయనకు ఇబ్బందులు తప్పవేమో అనిపిస్తోందన్న కడియం.. రేవంత్‌ రెడ్డి తన పార్టీ వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అంతకు ముందు బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. గతేడాది ద్రవ్యలోటు రూ.33 వేల కోట్లుగా ఉంది. ఈసారి బడ్జెట్‌లో ద్రవ్యలోటు భారీగా కనబడుతోంది. 2 లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారో జవాబివ్వాలి. గత ప్రభుత్వం పూర్తి చేసిన నియామకాలు తమవిగా చెప్పుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం తామే ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వం నాటి నోటిఫికేషన్లు కాకుండా కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. అని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news