చంద్రబాబుకు ఓటు వేయడం అంటే మన పిల్లల బంగారు భవిష్యత్ ను తాకట్టు పెట్టడమే అన్నారు సీఎం జగన్. చంద్రబాబు హామీలు నమ్మితే బంగారు కడియం ఇస్తామన్న పులి కథే మిగులుతుందన్నారు. వాలంటీర్లు కాబోయే లీడర్లు అన్నారు. చంద్రబాబు వస్తాడు.. చంద్రముఖీలు వస్తాయి. చొక్కా చేతులు మడచాల్సిన సమయం వచ్చింది. బాబుకు ఓటు వేయడమే అంటే.. ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖీని మళ్లీ ఇంటికి తీసుకురావడమే అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే.. ఇప్పుడు అమలు అవుతున్న పథకాలు అన్నీ కూడా రద్దు అవుతాయని పేర్కొన్నారు సీఎం జగన్.
ఒక పక్క జగన్, మరో పక్క దత్తపుత్రుడు, జాతీయ పార్టీ అందరూ ఏకమయ్యారు. దుష్టచతుష్టయమంతా ఏకమైనా జగన్ కి ప్రజలు ఉన్నారు. మిమ్మల్ని చూస్తే చంద్రబాబు గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయి. మన మీద దాడి చేస్తోంది బాబు ఒక్కడే కాదు.. జాతీయ పార్టీలు, దత్తపుత్రుడు ఇలా అందరూ.. మనకు ఉన్నది వాళ్లకు లేనిది గొప్ప విశ్వాసంతోనే ముందుకు వెళ్లడం అని చెప్పారు. చెడిపోయిన వ్యవస్థను బాగు పరచడానికి మీ బిడ్డ ప్రయత్నం చేస్తున్నాడు. 10 నుంచి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవీలో ఉంటే.. చిన్నపిల్లాడు పెద్దోడు అయి అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడుతాడు. భవిష్యత్ మార్పు చెందుతుంది.