కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 17న బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు ఇన్సురెన్స్ పత్రాల పంపిణీ,వికలాంగులకు వీల్‌చైర్స్ పంపిణీ, పేషేంట్స్ పండ్ల పంపిణీ తదితర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని పేర్కొన్నారు.70వ పుట్టినరోజు సందర్భంగా 70 కేజీల భారీ కేక్‌ను కట్ చేయనున్నట్లు వివరించారు.ఆలయాలు, మసీదులో, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.