కడియం శ్రీహరికి శీల పరీక్ష చేయాలి – తాటికొండ రాజయ్య

-

కడియం శ్రీహరికి శీల పరీక్ష చేయాలని డిమాండ్‌ చేశారు తాటికొండ రాజయ్య. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. సీఎం టూర్ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పొలిటికల్ హీట్ పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సభను అడ్డుకుంటామని ప్రకటించారు బీఆర్ఎస్ మాజీ MLA తాటికొండ రాజయ్య. రేవంత్ రెడ్డి.. తుగ్లక్ ముఖ్యమంత్రి అని… రేవంత్ రెడ్డి భారతదేశంలోనే అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి అంటూ నిప్పులు చెరిగారు.

Kadiyam Srihari should be tested for morality said Thatikonda Rajaiah

ఇచ్చిన హామీలు అమలు కాకుండా సిగ్గు,శరం లేకుండా రేవంత్ రెడ్డి వస్తున్నాడని… సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికైనా పోవచ్చు కానీ స్టేషన్ ఘన్పూర్ కు రావద్దని హెచ్చరించారు.ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కులగోడతానన్నది కడియం శ్రీహరేనని… పార్టీ మారిన వారిని పిచ్చి కుక్కను కోటినట్టు రాళ్ళతో కొట్టాండని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. కడియం శ్రీహరి కి శీల పరీక్ష చెయ్యాలి… కడియం శ్రీహరి మీద మొదటి రాయి రేవంత్ రెడ్డి వెయ్యాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాయి తరువాత కడియం శ్రీహరి పై రెండో రాళ్ళు వేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో స్టేషన్ ఘన్పూర్ లో ఒక కొత్త పని మొదలుపెట్టి తట్ట మట్టి తియ్యలేదని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version