కాళేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద..ప్రమాదం తప్పదా !

-

కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో కాలేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మేడిగడ్డ బ్యారేజీకి ఇను ఫ్లో 13,16,961 క్యూసెక్కులుగా ఉంది. 85 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. దీనివల్ల గోదావరి ఉధృతి మరింత పెరుగుతోంది.

ఏటూరు నాగారం, వాజేడు, మంగపేట, వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాలకు ముంపు పొంచి ఉండటంతో… ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిబరీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. అదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, యాదాద్రి, సంగారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, MDK, KMR, SDT, భూపాలపల్లి, KRMR, PDPL, ములుగు, భద్రాద్రి, RR, HYD, మేడ్చల్, VKB, MBNR జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news