కాళేశ్వరం ఏడాదికి కూలింది..మేం తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడతాం : సీఎం రేవంత్ రెడ్డి

-

తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడతాం.. ఆదిలాబాద్ కి నీళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాకా జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన  కాళేశ్వరం ప్రాజెక్ట్..  కట్టిన ఏడాదికే కూలింది. వాళ్ళే ఉంటే కూలిన ప్రాజెక్టు ఎత్తిపోస్ కాంట్రాక్టు కూడా.. ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇచ్చే వాళ్ళు. వాళ్లు  దిగమింగేటోల్లు అన్నారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అది కాకుండాపోయిందన్నారు.

హైదరాబాద్ పూర్తిగా గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. ఫామ్ హౌస్ లను కాపాడుకునేందుకు కొందరూ పేదలను రెచ్చగొడుతున్నారు. గత ఎండా కాలం బెంగళూరులో నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. రాను రాను మైదరాబాద్ లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. విపక్షాల సూచనలు తప్పకుండా స్వీకరిస్తాం. మూసీ నిర్వాసితులను అనాథలను చేయం అన్నారు. బఫర్ జోన్ లో ఇళ్లు ఉన్న వాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తాం అన్నారు. మూసీ నిర్వాసితుల కోసం రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నిర్వాసితులకు ఒక మంచి జీవితాన్ని ఇద్దామన్నరు. హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగీల్ అయిపోయింది. బీఆర్ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయి. అందులో రూ.500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చు కదా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version