ఇవాళ హైదరాబాద్ కు కల్వకుంట్ల కవిత రానున్నారు.. ఈ సందర్భంగా కేసీఆర్ తో కల్వకుంట్ల కవిత కీలక భేటీ కానున్నారు. ప్రస్తుతం ఢిల్లీ లో కవిత, కేటీఆర్, హరీష్ రావులు ఉన్నారు. నిన్న రాత్రి తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు కల్వకుంట్ల కవిత. ప్రస్తుతం ఢిల్లీ లోని బి ఆర్ ఎస్ కార్యాలయంలో ఉన్నారు కల్వకుంట్ల కవిత.
అటు ఇవాళ రౌస్ ఏవిన్యూ కోర్టులో సీబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రౌస్ ఏవిన్యూ కోర్టుకు వర్చువల్ గా హాజరు కానుంది కల్వకుంట్ల కవిత. కోర్ట్ ప్రొసీడింగ్స్ పూర్తయ్యాక 2.30 కి హైదారాబాద్ కు వెళ్లనున్నారు కల్వకుంట్ల కవిత.
కాగా, తీహార్ జైలు నుంచి విడుదల అయ్యాక.. కల్వకుంట్ల కవిత మీడియాను అడ్రస్ చేశారు. పోరాటం కొత్త కాదని.. 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసానని ప్రకటించారు. బీఆరెస్ పార్టీకి, కేసిఆర్ గారికి,నాకు, నా కుటుంబానికి అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.