సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి వీపు చింతపండు అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరి జోలికి పోరు.. వాళ్ల జోలికి వస్తే వీపు చింతపండు చేస్తారు. సంకనాక పిలిచారా..? అని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
దానికి కౌంటర్ గా కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ మంత్రులు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఇద్దరూ బీఆర్ఎస్ నేతలు పంచాయితీ పేర్కొంటే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మావాళ్లు అని పేర్కొన్నారు. వీళ్ల మాటలు వింటుంటే నవ్వు వస్తుందన్నారు కౌశిక్ రెడ్డి. రేవంత్ రెడ్డి.. కౌశిక్ రెడ్డి ఎవ్వరికీ జోలికి పోడు.. అతని జోలికి వస్తే.. మాత్రం ఊరుకోడు.. చూడు నువ్వే సవాల్ విసిరారు. ఏదో ఒక రోజు నీకు ఏ గతి పడుతుందో చూడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.