లిక్కర్ కేసులో బిజీగా లేకపోవడంతో కవిత కొత్త నినాదం.. మంత్రి పొన్నం సెటైర్లు

-

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. పదేళ్లు బీఆర్ఎస్ కు పూలే విగ్రహం గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. పూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తోంది. కవిత లిక్కర్ కేసులో బిజీ లేనట్టుంది. అందుకే కొత్త నినాదం ఎత్తుకుందని సెటైర్లు వేశారు. 10 సంవత్సరాల జ్యోతిరావుపూలే విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాజకీయం చేయాలనుకుంటే బయట చేయండి.. శాసన సభ ఆవరణలో శాసన సభ్యురాలు కానీ వ్యక్తి రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. మీ పార్టీ అధ్యక్ష, పదవీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీ ప్రతిపక్ష నేత పదవీ బీసీలకు ఇవ్వండి అప్పుడు మీకు బీసీలపై చిత్త శుద్ధి ఉన్నట్టు అని ఘాటు విమర్శలు చేశారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే బలహీన వర్గాలకు న్యాయం చేయాలని కుల జనగణన చేస్తామని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీ కుల గణన చేస్తామని మేనిఫెస్టో లో చెప్పామని గుర్తు చేశారు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి శాఖ పరంగా జరిగిన సమావేశంలో బీసీ, కులగణనపై చర్చ జరిగింది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version