మాట తప్పడం కాంగ్రెస్ DNAలోనే ఉంది: కవిత

-

మాట తప్పడం కాంగ్రెస్ DNAలోనే ఉందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఎన్నికలు కాగానే కాంగ్రెస్ పార్టీ హామీలను మర్చిపోతోంది. కర్ణాటకలో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటివరకు ఏమీ చేయలేదు.

విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేస్తామని చెప్పి వెనక్కి తగ్గింది. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీతో ఉండాలా? వద్దా? అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది అని వాక్యానించారు.అటు నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్‌ సమాఖ్య ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేయడాన్ని ఆహ్వానిస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ లో ట్వీట్‌ చేశారు.

మన రెజ్లర్లు దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచారని వాళ్లను చూసి చాలామంది మహిళలు ఇండియా తరఫున ప్రపంచ వేదికపై నిలవాలని కలలు కంటున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అలాంటి వారికి న్యాయ, పారదర్శక వ్యవస్థ ముఖ్యమని అన్నారు. తాజాగా కేంద్ర క్రీడ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం భారత రెజ్లింగ్‌ బలోపేతానికి ఒక మార్గంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news