కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ ముందు నువ్వెంత..? – భట్టి

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పాదయాత్రలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపడం కేసీఆర్ నీవల్ల కాదు కదా! మీ తాత వల్ల కూడా కాదు. నీలాంటి కెసిఆర్ లను వందల మందిని కాంగ్రెస్ చూసింది. నిన్నే మూడు చెరువుల నీళ్లు తాపించి మూడు నెలల్లో బంగాళాఖాతంలో ముంచుతాం. ఇక కాస్కో ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ ముందు నువ్వు ఎంత? నీ కొడుకు ఎంత? నీ అల్లుడు ఎంత? కాంగ్రెస్ శ్రేణులు కధం తొక్కితే ఆ అడుగుల శబ్దానికే చస్తారు.

అడ్డగోలుగా మాట్లాడటం మానుకో. కందకం నుంచి ఎలక బయటకు వచ్చినట్టు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే అడ్డగోలుగా మాట్లాడుతుండు.దొరల ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని కేసిఆర్ గ్రహించాలి. పోలీసు రాజ్యంలోని పాము పడగ నీడలో భయం భయంగా బతుకుతున్న ప్రజలకు నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ విముక్తి కల్పిస్తుంది.

10 ఏళ్లుగా భయపెట్టి తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం. చేసిన గ్రామ అభివృద్ధి పనులకు సైతం బిల్లులు ఇవ్వకుండా సర్పంచులను వేధింపులకు గురిచేస్తున్న ప్రభుత్వం. ప్రశ్నిస్తే కేసులు, బెదిరింపులు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్నా అనుమానం కలుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తామని, దొరల ప్రభుత్వం వద్దని ప్రజలే ప్రజా ప్రభుత్వం తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version