మోటర్లకు మీటర్లు పెట్టడానికి కేసీఆర్‌ ఒప్పుకోలేదు: జగదీశ్వర్‌రెడ్డి

-

రైతుల మోటర్లకు మీటర్లు పెట్టడానికి కేసీఆర్‌ ఒప్పుకోలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్వర్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. కేంద్రం ఇచ్చే రూ.30 వేల కోట్లను కూడా వదులుకున్నామని తెలిపారు. విద్యుత్‌ మీటర్ల అంశంలో సీఎం ప్రజలను పక్కదారి పట్టించారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ ఉదయ్‌ స్కీమ్‌ గురించే మాట్లాడుకున్నారని స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లు, రైతుల మోటార్లకు మీటర్ల అంశంపై చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి స్పందించారు.

ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 ముందు మాత్రమే కరెంటు లైన్ల కింద ఇళ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు లైన్ల కింద ఇల్ల నిర్మాణం జరగలేదని చెప్పారు. పదేళ్ల తమ పాలనలో రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం పెరిగిందని వెల్లడించారు. 2014లో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్‌ వినియోగం 1,196 కిలో వాట్లు ఉంటే.. 2024లో వ్యక్తిగత విద్యుత్‌ వినియోగం 2,349 కిలో వాట్లకు పెరిగిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news