నేడు టీవీ9కు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఇంటర్వ్యూ

-

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ దేనికదే దీటుగా ప్రచారం సాగిస్తున్నాయి. విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయాన్ని రంజుగా మారుస్తున్నాయి. అధికార కాంగ్రెస్, గత రాష్ట్ర ప్రభుత్వమైన బీఆర్ఎస్ సర్కార్ ను, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాలపై తీవ్రంగా విరుచుకు పడుతుంటే.. బీఆర్ఎస్.. బీజేపీ, కాంగ్రెస్ లపై ధ్వజమెత్తుతోంది. ఇక బీజేపీ.. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఫైర్ అవుతోంది.

అయితే అసెంబ్లీ ఫలితాలు రిపీట్ కాకుండా ఈసారి ఎలాగైనా మెజార్టీ సీట్లు సాధించాలనే పట్టుతో ఉంది బీఆర్ఎస్. ఆ దిశగా గులాబీ బాస్ వరుసగా సమావేశాలు, సమీక్షలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ కల్పిస్తున్నారు. అయితే కేసీఆర్ గత ఎన్నికల్లో ఎప్పుడూ చేయని ఓ పని ఈ లోక్ సభ ఎన్నికలకు చేస్తున్నారు. అదేంటంటే..?

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. దాదాపు పదేళ్ల తర్వాత ఓ టీవీ ఛానెల్ కు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఆయన టీవీ9లో యాంకర్ రజనీకాంత్ లో లైవ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. యావత్ రాష్ట్రమంతా ఈ ఇంటర్వ్యూ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version