విచారణ నుంచి తప్పుకోండి.. జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ లేఖ

-

విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చేస్తున్న విచారణపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదని ఆయన అన్నారు. తాను ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోందని .. విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా విన్నవిస్తున్నానంటూ కమిషన్‌కు కేసీఆర్‌ ఘాటుగా లేఖ రాశారు.

యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలు నిర్ణయాలపై ఈ నెల 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కమిషన్‌ కేసీఆర్‌కు ఇటీవల నోటీసు పంపిన విషయం తెలిసిందే. దీనికి సమాధానంగా ఆయన 12 పేజీల్లో ఘాటైన పదజాలంతో కమిషన్‌ ఏర్పాటును, ఛైర్మన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ప్రశ్నిస్తూ లేఖ రాశారు. అసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని.. తెలంగాణ ఆనాడు కరెంటు విషయంలో అసాధారణ సంక్షోభంలో ఉన్నందునే భద్రాద్రి విద్యుత్కేంద్రాన్ని సబ్‌ క్రిటికల్‌ పరిజ్ఞానంతో నిర్మించాలని నిర్ణయించామని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. దేశంలో అప్పటికే 90 శాతం సబ్‌ క్రిటికల్‌ పరిజ్ఞానంతో నిర్మించిన ప్లాంట్లే ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే ఈ పరిజ్ఞానంతో ప్లాంటు పెట్టినట్లు.. చేయరాని తప్పు ఏదో చేసినట్లు జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడిన తీరు దురుద్దేశాన్ని బయటపెట్టిందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news