నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

-

రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ జరగనుంది. ఇవాళ నిమ్స్ ఆస్పత్రిలో కొత్త భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మొదటగా ఆరుగురు గర్భిణీలకు ఈ కిట్స్​ను అందించనున్నారు. ఇప్పటికే 9 జిల్లాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్ కిట్ పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. మిగిలిన 24 జిల్లాల్లో ఈరోజు నుంచి న్యూట్రిషన్ కిట్ల పంపిణీ జరగనుంది. ఈ కిట్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6.8 లక్షల మంది గర్భిణీలకు ప్రయోజనం కలుగుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు. న్యూట్రిషన్ కిట్ల కోసం బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించారు.

గర్భిణుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించడంతో పాటు మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు కానుంది. ప్రధానంగా మాతృ మరణాల రేటు తగ్గింపులో.. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లు కీలకంగా మారుతాయని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. మొదట తొమ్మిది జిల్లాల్లో ఈ కిట్ల పంపిణీ జరిగింది. ఈ తొమ్మిది జిల్లాల్లో పథకం ప్రయోజనాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనం చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమంగా అందులో వెల్లడైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version