దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు వైద్య, ఆరోగ్య దినోత్సవం

-

తెలంగాణ రాష్ట్రం సాధించుకుని తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తయి.. పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మంగళవారం రోజున మహిళా సంక్షేమ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు.

ఇక రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెలంగాణ వైద్య,ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గర్భిణులకు కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులు, వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది, మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీల విద్యార్థులతో సభను నిర్వహించి వైద్య,ఆరోగ్యశాఖ కార్యక్రమాలను వివరిస్తారు. వైద,ఆరోగ్యశాఖ ప్రగతిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తారు. ఈ సభల్లోనే ఉత్తమ ఆశా వర్కర్‌, ఏఎన్‌ఎం, స్టాఫ్‌నర్స్‌, టెక్నీషియన్‌ సహా ఉత్తమ డాక్టర్లను సన్మానించి అవార్డులు అందజేస్తారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version