KCR: రేపు చింతమడకకు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. రేపు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓటుహక్కుని వినియోగించుకోనున్నారు రాజకీయ ప్రముఖులు, అభ్యర్థులు. సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మాజీ సీఎం కేసీఆర్. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఓటుహక్కుని వినియోగించుకోనున్నారు మంత్రి దామోదర రాజనర్సింహ.
సిద్దిపేట భరత్ నగర్ లో ఓటు వినియోగించుకోనున్నారు సిద్దిపేట ఎమ్మెల్యే,మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక (మం) బొప్పాపూర్ గ్రామంలో ఓటు వినియోగించుకోనున్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. సంగారెడ్డి పట్టణంలో ఓటు వినియోగించుకోనున్నారు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.