తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో అందుకు దాదాపు రూ.500 కోట్ల మేర నిధులు కేటాయించాలని నివేదించినట్లు సమాచారం.
బడ్జెట్ లో కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడితే వచ్చే వానాకాలం సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి 2020లో వైదొలిగాక రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం అమలు కావడం లేదు. దీంతో పంట నష్టం జరిగినా రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొంది.