కాంగ్రెస్ వస్తే మళ్లీ పైరవీ కారుల రాజ్యమే : కేసీఆర్ 

-

తెలంగాణలో కాంగ్రెస్ వస్తే మళ్లీ పైరవీ కారుల రాజ్యమే అవుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇవాళ సూర్యపేట పర్యటన భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ధరణి ఉండాలా తీసేయాలా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ప్రజలందరూ ఉండాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నాయి.  ఛతీస్ గడ్, రాజస్థాన్  లో కాంగ్రెస్ అధికారంలోనే ఉంది.. అక్కడ రూ.4వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సూర్యపేట నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభించారు సీఎం కేసీఆర్.

వాళ్లు పెన్షన్ పెంచుతున్నామంటున్నారు. కానీ మాకు పెన్షన్ పెంచడం చేతకాదా..? కాంగ్రెస్ తన జన్మల రూ.1000 పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు ధరఖాస్తు లేకుండా రైతు బంధు ఇస్తున్నాం. ధరణి వల్ల సెల్ ఫోన్ లు మోగుతాయి. రైతు భూమిని మార్చాలంటే సీఎంకి కూడా పవర్ లేదు. భూమిని మార్చే అధికారం రైతు బొటన వేలుకు మాత్రమే ఉందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లకు 12 సీట్లు గెలవాలన్నారు కేసీఆర్.  నల్గొండలో అల్ట్రా మెగా ప్రాజెక్ట్ రాబోతుంది. రూ.37కోట్ల రైతు రుణమాఫీ చేశామని తెలిపారు కేసీఆర్.  మీ ఊర్లలో మోటార్లు కాలిపోతే ఏం చేసేవారో తెలుసు.  బీఆర్ఎస్ గెలవబోతుందని స్పష్టం చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news