ఈనెల 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న సభపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత పార్టీ నేతలతో ఎర్రవల్లిలోని తన ఫాం హౌసులో సమావేశమయ్యారు. మహిళా నేతలతో పాటు పలువురు కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ రజోతత్సవ సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. సభ విజయవంతం అయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన నేతలకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీష్ కుమార్ పాల్గొన్నారు.