బీజేపీ నేతలు రజాకార్ల గురించి ఇంకెన్నాళ్లు మాట్లాడుతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. వాళ్లు మతం గురించి తప్ప.. అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడార..? అని ప్రశ్నించారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా..? కులం, మతం పేరుతో రాజకీయాలు తప్ప.. బీజేపీకి అభివృద్ధి పట్టదు అన్నారు.
మతం పేరుతో చేసే రాజకీయాలకు కాలం చెల్లింది. మూసీ పునరుజ్జీవం విషయంలో బీజేపీకి స్పష్టత లేదు. బీజేపీ నేతలకు రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలనే సోయి లేదు. మెట్రో విస్తీర్ణంలో హైదరాబాద్ రెండో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయింది. మెట్రో రెండో దశకు కేంద్రం అనుమతి, నిధులు తీసుకురావాలనే ఆలోచన లేదని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్.