నేటి నుంచి బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థిత్వాల ఖరారుపై సమావేశాలు

-

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్సభ పోరులో పునరావృతం కాకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఈ ఎన్నికలు గులాబీ దళానికి సవాల్ విసురుతున్నాయి. ఈ పార్టీ నుంచి కీలక నేతల వలసలు కొనసాగుతున్నాయి. టికెట్ వస్తుందో రాదోనన్న అనుమానంతో కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన పార్టీ ఇవాళ్టి నుంచి లోక్సభ ఎన్నికల అభ్యర్థిత్వాలపై దృష్టి సారించనుంది.

లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నేతలతో పార్టీ అధినేత కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కేసీఆర్‌ సమావేశం అవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీచేస్తే బాగుంటుందనే అంశంపై నేతలనుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వాటన్నింటి ఆధారంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లే. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్‌నేత పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరంతో ఈ రేసులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు బలంగా వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news