ఓల్డ్సిటీ ‘లక్క గాజుల’కు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ గుర్తింపు

-

భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. నగరంలోని పాతబస్తీ లక్క గాజులకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) గుర్తింపు లభించింది. ఇది వరకే హైదరాబాద్‌ హలీమ్‌కు జీఐ ట్యాగ్‌ దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో లక్క గాజులు చేరాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్‌ లాడ్‌బజార్‌ లాక్‌ గాజులను తెలుగులో లక్క రాళ్ల గాజులు అంటుంటారు.

తాజాగా ఈ లక్క గాజులకు చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ జీఐ రిజిస్ట్రీ శనివారం జీఐ రిజిస్ట్రేషన్‌ ట్యాగ్‌ను ప్రకటించింది. తెలంగాణలో జీఐ ట్యాగ్‌ అందుకున్న 17వ ఉత్పత్తి ఇది. హైదరాబాద్‌ పాతబస్తీ గాజులకు ప్రసిద్ధి చెందిందనే విషయం తెలిసిందే. ఇక్కడ తయారయ్యే రకరకాల గాజుల్లో లక్క రాళ్ల గాజులు స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందాయి. ఈ గాజుల తయారీ క్లిష్టమైన ప్రక్రియ. రెసిన్‌ను కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది. దీన్ని వృత్తాకారంలో మలిచి.. దానిపై స్ఫటికాలు, రాళ్లు, పూసలు, అద్దాలను హస్తకళాకారులు అందంగా చేతులతోనే పొదుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news