ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేస్తూ కరీంనగర్ చేరుకున్నారు. కేసీఆర్ వెంట సిద్దిపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు 100 కార్లలో బయల్దేరి వెళ్లారు. ఇటీవలే జనగామ, సూర్యాపేట జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తాజాగా కేసీఆర్ ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
కరీంనగర్ గ్రామీణ మండలం ముగ్దుంపూర్ గ్రామం చేరుకున్న కేసీఆర్.. అక్కడ ఎండిన పంట పొలాలను పరిశీలించారు. రైతుల కష్టాలను అడిగి ఆయన తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటలు పరిశీలించిన అనంతరం మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో కేసీఆర్ భోజనం చేయనున్నారు. ఆ తర్వాత కరీంనగర్‌తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ పర్యటించి బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పొలాలను పరిశీలిస్తారు. శెభాష్‌పల్లి బ్రిడ్జి వద్ద మధ్యమానేరు ప్రాజెక్టును సందర్శించి సాయంత్రం 4:00 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహిస్తారు.