కేసీఆర్‌ సలహాదారుడు మృతి..రేవంత్‌ సంతాపం !

-

కేసీఆర్‌ సలహాదారుడు మృతి చెందితే..రేవంత్‌ రెడ్డి సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల సీనియర్ కాన్సల్టెంట్ రంగారెడ్డి మృతి చెందారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సలహాదారుగా పనిచేశారు రంగారెడ్డి. ఇటీవలే నీటిపారుదలశాఖకు కాన్సల్టెంట్ గా నియామకం అయ్యారు రంగారెడ్డి. అయితే…కాలు విరిగి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం రోజున మృతి చెందారు.

There is a strong campaign that 12 Rose Party MLAs will join the Congress party in Tukkuguda Sabha today.

అయితే.. నీటి పారుదల ప్రాజెక్టుల సలహాదారుడు, రిటైర్డ్‌ ఎస్ఈ ఎన్‌.రంగారెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్​ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్​ నగర్​ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పనులు పూర్తి చేయడానికి ఇటీవలే ఆయనను సలహాదారుగా నియమించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇరిగేషన్ విభాగానికి ఆయన అందించిన సలహాలు సూచనలు విలువైనవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుని ప్రార్ధించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news