తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై రేవంత్‌ సర్కార్‌ కీలక ఆదేశాలు

-

తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై రేవంత్‌ సర్కార్‌ కీలక ఆదేశాలు చేసింది. జూన్ సెకండ్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సర్క్యూలర్ విడుదల చేసింది ప్రభుత్వం. గ్రామస్థాయి నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయి వరకు వేడుకలు నిర్వహించాలని అధికారిక ఆదేశాలు జారీ చేసిన సిఎస్ శాంతకుమారి….ఎలక్షన్ కమిషన్ అనుమతితో వేడుకలు నిర్వహిస్తున్నట్లు సర్క్యూలర్లో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్ పర్సన్స్, చైర్పర్సన్ డిసిసిబి, మున్సిపల్ చైర్మన్లు, ఆయా కార్యాలయాల్లో జాతీయ పథకాన్ని ఆవిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు సిఎస్ శాంతకుమారి. జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేయాలని కోరారు. అధికారికంగా కార్యక్రమాలు అన్ని జిల్లా కార్యాలయాలు, శాఖల కార్యాలయాల్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సిఎస్ శాంతకుమారి.

Read more RELATED
Recommended to you

Latest news