గజ్వేల్ లో కేసీఆర్ ఘన విజయం

-

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని గజ్వేల్‌ నియోజకవర్గంలోని గజ్వేల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌ రావు ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్తి ఈటల రాజేందర్‌పై 45,174 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తూమ్‌కుంట నర్సారెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.

తెలంగాణలో ఇవాళ వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ దే పై చేయిగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించింది. కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి, మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి మినహా ఇతర మంత్రులు విజయం సాధించలేకపోయారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా మంది ఓడిపోయారు. కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినట్టయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎంపీ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ సరైన అభ్యర్థికి టికెట్ ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ముఖ్యంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థిని అప్పటికప్పుడు నియమించడంతో ఓటమి పాలు అయింది. ఈసారి నల్లగొండ అభ్యర్థిని తెర చిన్నప్పరెడ్డికి టికెట్ కేటాయిస్తే కచ్చితంగా విజయం సాధిస్తుందనే ప్రజలు పేర్కొంటున్నారు. ఇలాంటి కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్టయితే బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news