అరగంట పవర్ కట్‌.. కీసర డీఈపై సస్పెన్షన్‌ వేటు

-

అరగంట కరెంట్‌ నిలిపివేత నేపథ్యంలో ఓ విద్యుత్ అధికారిపై వేటు పడింది. హైదరాబాద్‌లోని హబ్సిగూడ సర్కిల్‌ కీసర డివిజనల్‌ ఇంజినీర్‌ (డీఈ) ఎల్‌.భాస్కర్‌ రావును దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్‌ చేశారు. నాగారం ఆపరేషన్‌ అడిషనల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈఈ)పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అత్యవసర పరిస్థితుల్లో లైన్‌ క్లియరెన్స్‌ (ఎల్‌సీ) తీసుకోవాలన్నా.. సర్కిల్‌ ఎస్‌ఈ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 33కేవీ అమ్ముగూడ ఫీడర్‌పై డీఈ భాస్కర్‌రావు శనివారం అనుమతి లేకుండానే ఎల్‌సీ ఇచ్చారు. దీంతో ఆ రోజు ఉదయం 10.05 నుంచి 10.35 వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో నాగారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహిస్తున్నారు.

అదే సమయంలో ఆయన కరెంట్‌ కోతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ విషయం కార్పొరేట్‌ కార్యాలయం దృష్టికి వచ్చింది. దీంతో నివేదిక ఇవ్వాలని ఎస్‌ఈ, సీజీఎంను సీఎండీ కోరారు. ఉన్నతాధికారుల దీనిని తీవ్రంగా భావించిన యాజమాన్యం డీఈ, నాగారం ఏఈఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news