తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ శాఖలో కారుణ్య నియమాకాలకు గ్రీన్ సిగ్నల్..!

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యంగా పంచాయతీ రాజ్ శాఖలో కారుణ్య నియామకాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రబుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఆర్ఆర్ డీ శాఖ లో 588 కారుణ్య  నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Cabinet

తాజాగా జరుగుతున్న కేబినెట్ భేటీలో పంచాయతీ రాజ్ శాఖలో కారుణ్య నియామకాల కింద దాదాపు 550 కి పైగా పోస్టులను భర్తీ చేసేందుకు ఆ శాఖ గతంలోనే ఫైల్ సిద్ధం చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అప్పుడే అంగీకరించింది. ఇవాళ జరుగుతున్న కేబినెట్ లో ఈ ఫైల్ కు ఆమోదముద్ర వేసింది. అర్హతలను బట్టి ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో కారుణ్య నియామకాలు చేపట్టబోతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news