హైడ్రా కీలక నిర్ణయం.. ప్రతీ సోమవారం ఫిర్యాదులు..!

-

హైదరాబాద్ నగరంలో ప్రతీ ఒక్కరినీ హడలెత్తిస్తున్న హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువులు పరిరక్షణ, పునరుద్ధరణ, నాలాలు, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడటంతో పాటు ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు అండగా నిలబడి సహాయ సహకారాలు అందించేందుకు ఉద్దేశించిన హైడ్రా ఇప్పుడు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించడానికి సిద్ధమైంది. ప్రతీ సోమవారం ఫిర్యాదులు చేసుకోవచ్చు. కానీ సెలవు రోజుల్లో మాత్రం ఫిర్యాదులు స్వీకరించబడవు. 

చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు ఇలా ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేసే క్రమంలో ప్రతీ సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులతో పాటు సలహాలను కూడా స్వీకరించడానికి ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు రాణిగంజ్ లోని బుద్ధభవన్ లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఫిర్యాదుకు సంబంధించిన అన్ని ఆధార పత్రాలతో పాటు పూర్తి వివరాలు తీసుకొని కార్యాలయానికి రావాలని హైడ్రా కమిషనర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news