తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ ఫస్టియర్ ప్రాక్టికల్ పరీక్షల సిలబస్ పై తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది పరీక్షలను 70% సిలబస్ కే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సెకండియర్ లో మాత్రం 100% సిలబస్ అమల్లో ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇంటర్ లో సైన్స్ గ్రూపులు, ఒకేషనల్ కోర్సుల్లోని విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ కలిపి సెకండ్ ఇయర్ లో ఒకేసారి నిర్వహిస్తారు. ఫస్ట్ ఇయర్ లో ప్రాక్టికల్ పరీక్షలు ఉండవు. అయితే కరోనాతో నిరుడు ఇంటర్ ఫస్టియర్ లో 70% సిలబస్ అమలు చేయగా, ఈ ఏడాది వంద శాతం సిలబస్ ను అమలు చేస్తున్నారు.