బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హేమ తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పింది. అయినప్పటికీ అరెస్టు కావడం గమనార్హం. తాజాగా హేమకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవ్ పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు వేసిన చార్జీషీట్పై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది.
ఈ క్రమంలో హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకోలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టులో బలంగా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో హేమా ఆ రోజు రాత్రి రేవ్ పార్టీలో పాల్గొన్న సాక్ష్యాలను బెంగళూరు పోలీసులు కోర్టుకు అందజేశారు. ఇరు పక్షాల వాదోపవాదులు విన్న ధర్మాసనం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార జైల్లో ఉండగా బెయిల్ మంజూరు అవ్వడంతో శుక్రవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలైంది.