సిట్ చేతికి ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక ఆధారాలు!

-

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో చట్టవిరుద్ధంగా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ దందాపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న సిట్..  కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ కొండాపూర్‌లోని కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ కార్యాలయంలో సోదాలు చేసింది. 3 సర్వర్లు, హార్డ్‌డిస్క్‌లతోపాటు 5 మాక్‌ మినీ డివైజ్‌లను జప్తు చేసింది. ల్యాబ్స్‌లో జప్తు చేసిన పరికరాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించి వాటిని విశ్లేషించే పనిలో ప్రత్యేక దర్యాప్తు బృందం నిమగ్నమైంది.

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ సంస్థే సమకూర్చింది. ఈ కేసుకు సంబంధించిన యాక్సెస్‌ లాగ్స్, సెర్చ్‌ లాగ్స్‌ కోసం సంస్థ డైరెక్టర్‌ బూసి పాల్‌ రవికుమార్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. అనంతరం ఆయన నుంచి సమాచారాన్ని సేకరించింది. ఈ నేపథ్యంలోనే ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి సిట్ కు కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news