సీఎం కేసీఆర్‌ సమక్షంలో BRSలో చేరిన మెదక్‌ కీలక నేతలు

-

సీఎం కేసీఆర్‌ సమక్షంలో BRSలో చేరారు మెదక్‌ కీలక నేతలు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మెదక్ నియోజకవర్గ ఇంచార్జి, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ తెదేపా అధ్యక్షుడు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఏకే.గంగాధర రావు శుక్రవారం నాడు ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీ లో చేరారు.

kcr

వీరితో పాటు మెదక్ నియోజకవర్గ టిడిపి కీలక నేతలు మైనంపల్లి రాధాకిషన్ రావు, రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ ఏకే రమేష్ చందర్ లు కూడా బిఆర్ఎస్ లో చేరారు. సిఎం కేసీఆర్ సమక్షంలో వారు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు కేసీఆర్.. పార్టీ గెలుపునకు కృష్టి చేయాలని కోరారు.

కాగా..త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి ఆగదని ప్రగతి పథంలో ఇంకా ముందుకు సాగుదాం అని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా అంతాయిపల్లి తూముకుంట లోని కన్వెన్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు టిఆర్ఎస్ గెలవనుందని పార్టీ శ్రేణులకు చెప్పారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news