బండి సంజయ్ కి బిగ్ షాక్.. డీకే అరుణకు తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి ?

-

తెలంగాణ బిజెపి పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం లో… బిజెపిని బలోపేతం చేసేందుకు.. కసరత్తు చేస్తోంది. గత కొన్ని రోజులుగా, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని.. ఆ పదవి నుంచి తొలగించాలని కొంతమంది ఆ పార్టీకి చెందిన నేతల అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

అలాగే ఈటెల రాజేందర్ ను తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం చేయాలని కొంతమంది లీడర్లు అధిష్టానాన్ని కోరారు. అయితే అధిష్టానం దానికి అంగీకారం తెలుపలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు… డీకే అరుణకు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేందుకు బిజెపి అధిష్టానం వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. బండి సంజయ్ కి కేంద్ర పదవి, ఈటెల రాజేందర్ కు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు బిజెపి ఆలోచన చేస్తుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version