BREAKING : సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ కారులో చోరీ

-

నిర్మాత ‘బెల్లంకొండ’ కారులో చోరీ జరిగింది. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ చోటు చేసుకుంది. కారు అద్దం పగులగొట్టి కొంత నగదు, ఖరీదైన మద్యం సీసాలను ఎత్తుకెల్లారు గుర్తు తెలియని వ్యక్తులు. జూబ్లీ హిల్స్ జర్నలిస్టు కాలనీలోని బెల్లంకొండ సురేష్ అలియాస్ సురేంద్ర చౌదరికి సాయిగణేష్ ప్రొడక్షన్స్ పేరుతో కార్యాలయం ఉంది.

సురేష్కు చెందిన బెంజి కారును కార్యాలయం ముందు నిలిపారు. కారు ఎడమవైపు వెనుక సీటువద్ద అద్దం పగిలి ఉంది. లోపల ఉంచిన రూ. 50వేల నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలు కని పించలేదు. ఒక్కో మద్యం సీసా ఖరీదు దాదాపు రూ.28వేలు ఉన్నట్లు సంచారం. ఈ మేరకు కార్యాలయ సిబ్బంది & సురేష్ సతీమణి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ సంఘటన పై కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version