మంత్రి సబితా గన్‌ మెన్‌ ఆత్మహత్యపై పోలీసుల కీలక ప్రకటన

-

మంత్రి సబితా గన్‌ మెన్‌ ఆత్మహత్యపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. గన్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్‌ సాజల్.

Key statement of the police on the suicide of Minister Sabita Gunmen

అయితే.. ఈ ఇష్యూపై డీసీపీ వెస్ట్ జోన్ జోయెల్ డేవిస్ మాట్లాడుతూ…సాజల్ ఈరోజు ఉదయం 6: 30 గంటలకు సర్వీస్ వెపన్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆర్ధిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ అధికారిగా డ్యూటీ చేస్తున్నాడు…

ఈ రోజు డ్యూటీ వచ్చే క్రమంలో ఉదయం 6 గంటలకు రిలేవర్ కు రిలీవింగ్ ఇచ్చాడని వెల్లడించారు. ఈ రోజు అతని కూతురిని కూడా తీసుకొని వచ్చాడు..హోటల్ వద్ద ఆమెతో మాట్లాడి పిస్తోల్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. తదుపరి వివరాలు దర్యాప్తులో తేలుతాయని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news