ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ కన్నుమూత

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దవాఖన లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 12.31 గంటలకు శ్వాస విడిచారు.

ఈ మేరకు ఆయన కుమారుడు సింగరి రాజ్ కుమార్ తెలిపారు. పంజాగుట్ట స్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ గా చాలా ఎళ్ల నుంచి  సుదర్శన్ ముదిరాజ్ పని చేస్తున్నారు. ఇక ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ తో స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.