ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం

-

ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. నిన్న అర్థరాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతికి చివరి పూజ నిర్వహించారు పూజారులు. ఇక అర్దరాత్రి 1 గంట తర్వాత ఖైరతాబాద్ మహాగణపతిని కదిలించింది ఉత్సవ కమిటీ. రాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 వరకు విగ్రహాలను భారీ టస్కర్ లోకి ఎక్కించింది కమిటీ. నిన్న సాయంత్రం, రాత్రి వర్షం కారణంగా వెల్డింగ్ పనులకు అంతరాయం చోటు చేసుకుంది.

Khairatabad Mahaganapati Namazjanam today at 12 noon
Khairatabad Mahaganapati Namazjanam today at 12 noon

టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకోనుంది ఖైరతాబాద్ మహా గణపతి. ఇక ఖైరతాబాద్ మహా గణపతి… ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య నిమజ్జనం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ఖైరతాబాద్ మహా గణపతి…హుస్సేన్‌ సాగర్‌ లోనే నిమజ్జనం కానుంది. ఈ మేరకు ఖైరతాబాద్ మహా గణపతి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అటు పోలీసు బందోబస్తు కూడా భారీగానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news